Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రిని కలిస్తే తప్పా? ఇనుప రాడ్‌ను కాల్చి వాతలు పెట్టిన?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడ

Advertiesment
Nellore
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఫలితంగా అన్యోన్యంగా వుండాల్సి భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఫలితంగా వారి సంతానానికి కష్టాలు తప్పట్లేదు. తాజాగా కన్నతల్లి కఠినాత్మురాలిగా మారిపోయింది. తన కొడుకు, తండ్రిని కలుసుకున్నాడనే అక్కసుతో తల్లిని అనే విచక్షణ మరచి ఏడేళ్ల చిన్నారి శరీరంపై వాతలు పెట్టింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా సూళూరుపేట మండలం సూళ్లూరు గ్రామానికి చెందిన ప్రశాంత్, కృష్ణకుమారి దంపతులు విడివిడిగా ఉంటున్నారు. వీరికి ఓ ఏడేళ్ల బాబు ఉన్నాడు. అయితే చిన్నారి తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం చిన్నారికి తన తండ్రిని చూడాలనిపించి.. తల్లికి తెలియకుండా తండ్రిని కలుసుకున్నాడు.
 
ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమారి ఆగ్రహంతో బాలుడిని చిత్రహింసలకు గురిచేసింది. ఐరన్ రాడ్‌ను కాల్చి కొడుకు శరీరంపై వాతలు పెట్టింది. దీనిపై తండ్రి ప్రశాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆపై తల్లిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!