Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంజాయ్ చేద్దాం రా.. అంటూ ప్రియుడిని పిలిచి కిరాతకంగా చంపేసిన ప్రియురాలు...

తన నగ్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానన్న ప్రియుడుని ఓ ప్రియురాలు అత్యంత కిరాతకంగా హత్యచేసింది. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేద్దాం రా అంటూ పిలిచి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని

Advertiesment
ఎంజాయ్ చేద్దాం రా.. అంటూ ప్రియుడిని పిలిచి కిరాతకంగా చంపేసిన ప్రియురాలు...
, ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:56 IST)
తన నగ్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానన్న ప్రియుడుని ఓ ప్రియురాలు అత్యంత కిరాతకంగా హత్యచేసింది. హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని ఎంజాయ్ చేద్దాం రా అంటూ పిలిచి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మధుర నగరానికి చెందిన సుశీల్‌ కుమార్‌ (23), డాలీ చౌదరీ (20) అనే యువతీయువకులు కొంతకాలం పాటు ప్రేమించుకుని, సహజీవనం చేశారు కూడా. ఆ తర్వాత తనకు నొయిడాలో ఉద్యోగం ఇప్పించిన మోహిత్‌ మావి అనే వ్యక్తితో డాలీకి స్నేహం ఏర్పడింది. దీన్ని సుశీల్ జీర్ణించుకోలేక పోయాడు. తన ప్రియురాలిపై పగ పెంచుకుని బెదిరింపులకు దిగాడు. మళ్లీ తనతో కలిసి ఉండాలనీ, లేదంటే తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ప్రైవేటు ఫొటోలను ఇంటర్నెట్‌లో పెట్టి పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. 
 
మాజీ ప్రియుడి వ్యవహారంతో ఆందోళనకుగురైన డాలీ అతన్ని అంతమొందించాలని భావించింది. తను పెళ్లిచేసుకోబోతున్న మనీష్‌ చౌదరీతో  పథకం రచించింది. ఓ హోటల్‌లో ఆగస్టు 11న డాలీ సుశీల్‌ కలుసుకున్నారు. అక్కడ ఎలాంటి అనుమానంరాకుండా వ్యవహరించిన డాలీ సుశీల్‌ను నమ్మించింది. నిద్రమాత్రలు కలిపిన కూల్‌డ్రింక్‌ని అతడి చేత తాగించింది. 
 
మనీష్‌ ప్రాణాలు విడిచిన అనంతరం మృతదేహాన్ని కాబోయే భర్త మనీష్‌తో కలిసి యమునా నదిలో పడేసింది. ఆ తర్వాత తన కుమారుడు కనిపించలేదంటూ సుశీల్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ జరుపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డాలీతో పాటు.. మోహిత్‌లను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖంపై కర్రతో కొట్టిన ప్రిన్సిపాల్.. విద్యార్థికి దంతాలు విరిగిపోయాయి..