బాలికను కిడ్నాప్ చేసి చెరకుతోటలోకి లాక్కెళ్లి.... నాలుక కోసి అత్యాచారం...

Webdunia
ఆదివారం, 16 ఆగస్టు 2020 (14:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు ఓ బాలికను కిడ్నాప్ చేసి కేకలు పెట్టకుండా ఉండేందుకు నాలుకను కత్తిరించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఉత్త‌రప్ర‌దేశ్ ల‌ఖీంపూర్ ఖేరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు కామాంధులు బలవంతంగా చెరకు తోటలోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమె నాలుక క‌త్తిరించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. 
 
అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. త‌మ కూతురు ఇంటి వద్ద క‌న‌బ‌డ‌క‌పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. చెరుకు తోటల్లో ఆమె మృతదేహం ఉందని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. దండగులు ఆమె క‌ళ్ల‌ను పీకేసినట్లు ఆ బాలిక తండ్రి అంటున్నాడు. 
 
అయితే, ఆ బాలిక క‌ళ్ల‌ను పొడిచినట్లు పోస్టుమార్టం నివేదిక‌లో వెల్ల‌డి కాలేద‌ని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు పలువురు ప్రముఖులు స్పందిస్తూ నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని మదం తో ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments