Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఐడీఏఐ కీలక నిర్ణయం.. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు..?

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (19:38 IST)
ఆధార్ కార్డులను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. మనిషి పుట్టిన తేదీ దగ్గర నుంచి చనిపోయే తేదీ వరకు వివరాలను సేకరించనుంది. తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం ఎంత అనేది స్పష్టంగా తెలిసిపోతుంది.
 
ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన నవ జాత శిశువులకు తాత్కాలిక ఆధార్ కేటాయించబోతోంది. వారికి ఐదేళ్లు వచ్చాక శాశ్వత ఆధార్ నెంబర్, మేజర్లయిన తర్వాత బయోమెట్రిక్ సేకరణ వంటివి చేయనుంది. 
 
దీని కోసం రెండు నెలల పాటు పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తోంది. దీంతో పాటు వ్యక్తి మరణించిన వెంటనే అతని వివరాలు ఆధార్ పోర్టల్‌లో నమోదయ్యేలా తగిన చర్యలు తీసుకోనుంది. 
 
ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగులైతే పింఛను ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయనేది వారి ఆలోచన. కరోనా లాక్‌డౌన్‌, తర్వాత పరిస్థితుల్లో అనేక మంది చనిపోగా, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు కాలేదు. వారి బ్యాంక్ అకౌంట్లు, రావాల్సిన పింఛన్లు యథావిధిగా వచ్చాయి. 
 
అంతేకాక, చనిపోయిన వారి ఆధార్, బ్యాంకు అకౌంట్లు ఆక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments