బెంగళూరులో రేవ్ పార్టీ: 30మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (10:09 IST)
బెంగళూరులో రేవ్ పార్టీ సంచలనానికి దారి తీసింది. నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న ఈ రేవ్ పార్టీని బెంగళూరు రూరల్ పోలీసులు కనుగొన్నారు. ఇంకా ఘటనలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. 
 
బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్‌ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 
పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్‌ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments