Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరణ ఇచ్చిన టర్కీ సంస్థ

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (11:19 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి టర్కీకి చెందిన సంస్థ కారణమంటూ జరుగుతున్న ప్రచారపై ఆ దేశానికి చెందిన కంపెనీ వివరణ ఇచ్చింది. కూలిన విమానానికి టర్కిష్ టెక్నిక్ సంస్థ నిర్వహణ చేపట్టిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తమని టర్కీకి చెందిన కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని డిస్‌ఇన్ఫర్మేషన్ నిరోధక కేంద్రం ఎక్స్ వేదికగా ఓ వేదికగా ప్రకటన విడుదల చేసింది.
 
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం లండన్‌కు బయలుదేరిన కొన్ని నిమిషాలకే కొద్దిసేపటికే ఈ విమానం బీజేపీ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు సిబ్బందితో పాటు నేలపై ఉన్న మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో కూలిన విమానానికి టర్కిక్ టెక్నిక్ నిర్వహణ చేసిందన్న ప్రచారం కేవలం భారత్ - టర్కీ సంబంధాలపై ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశించిన దుష్ప్రచారమేనని టర్కీ అరోపించింది. "2024, 2025 సంవత్సరాల్లో ఎయిరిండియా, టర్కిష్ టెక్నిక్ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం కేవలం బి777 రకం వైడ్ బాడీ విమానాలకు మాత్రమే నిర్వహణ సేవలు అందిస్తున్నాం. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఈ ఒప్పందం పరిధిలోకి రాదు. ఇప్పటివరకు ఈ రకానికి చెందిన ఏ ఎయిరిండియా విమానానికి టర్కిష్ టెక్నిక్ నిర్వహణ చేయలేదు" అని ఆ ప్రకటనలో వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments