సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

ఠాగూర్
ఆదివారం, 15 జూన్ 2025 (10:57 IST)
పొదిలి పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లును వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టినంత పని చేశారు. ఆయనపై దాడి చేసేందుకు దూసుకెళ్లారు. ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. సీఐపై దాడి చేసేందుకు వెళుతున్న చెవిరెడ్డిని పక్కనే ఉన్న డీఎస్పీ లక్ష్మీ నారాయణ అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ నెల 11వ తేదీన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పొదిలిలో పర్యటించారు. ఆ సందర్భంగా జగన్ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై పలువురు వైకాపా కార్యకర్తలు రాళ్ళతో దాడిచేశారు. ఈ దాడిలో పలువురు మహిళలతో పాటు పోలీసులు గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం 15 మంది వైకాపా కార్యకర్తలను అరెస్టుచేశారు. ఈ విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితులను కలవడానికి అనుమతి లేదని సీఐ వెంకటేశ్వర్లు చెప్పినా చెవిరెడ్డి వినిపించుకోకుండా, ఠాణాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, సీఐ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. 
 
దీంతో సీఐపై చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేస్తానంటూ చెవిరెడ్డి హెచ్చరించారు. ఒక దశలో సీఐ వెంకటేశ్వర్లు పైకి దూసుకెళ్లగా చెవిరెడ్డిని డీఎస్పీ లక్ష్మీనారాయణ అడ్డుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

రాశిఖన్నాకు దశ తిరిగిందిగా.. నాలుగు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో సంతకం చేసేసిందిగా!

Rukmini Vasanth: రష్మిక మందన్న స్థానాన్ని ఫిల్ చేసిన కాంతారా హీరోయిన్ రుక్మిణి?

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత.. నిర్మాతగా న్యూ లైఫ్

హిందీ చిత్ర నిర్మాణంపై దిల్ రాజు చూపు.. సల్మాన్ ఖాన్‌తో చిత్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments