Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్ కోసం లింగమార్పిడితో పెళ్లి.. మూడు నెలలు కాపురం చేశాక...

Webdunia
ఆదివారం, 6 జనవరి 2019 (18:17 IST)
తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు 21 యేళ్ళ యువతి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది. ఇందుకోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసింది. ఆ తర్వాత బాల్య స్నేహితురాలిని పెళ్లి చేసుకుంది. 3 నెలల పాటు కాపురం చేసి తర్వాత బాల్య స్నేహితురాలు భర్తకు షాకిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా కలిసిమెలిసి వుండేవారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 21 యేళ్ళ యువతి ఒకరు లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది. మూడు నెలల కాపురం తర్వాత భర్తకు భార్య షాకిచ్చింది. దీంతో భర్త ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. 
 
తన భార్యను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో బంధించారని, తనను కలిసేందుకు అనుమతించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము చదువకున్నప్పుడే ప్రేమలో పడ్డామని, అప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. అయితే, స్వలింగ వివాహానికి పెద్దలు నిరాకరించారని తెలిపారు. 
 
తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో లింగమార్పిడి చేయించుకోవాలని వారిలో ఒకరు నిర్ణయించుకున్నట్టు యువకుడిగా మారిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఏడాది క్రితం ఢిల్లీలో పది లక్షల రూపాయల ఖర్చుతో లింగమార్పిడి చేయించుకున్నాడని, ఇందుకోసం తెలిసిన వారి వద్ద డబ్బులు అప్పు తెచ్చినట్టు తెలిపారు. లింగ మార్పిడి అనంతరం గతేడాది అక్టోబరులో ఢిల్లీలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నట్టు వివరించారు.
 
దీంతో ఏం చేయాలో పోలీసులకు తోచడం లేదు. పైగా, తన భర్తతో కలిసివుండటం తనకు ఇష్టం లేదని భార్య మొండిపట్టుపట్టింది. ఈ భార్యాభర్తలిద్దరూ మేజర్లు కావడంతో వారిద్దరూ నిర్ణయం తీసుకునే హక్కువుందని ఎస్పీ స్మితి చౌదరీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments