Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ పురస్కారం అందున్న తొలి ట్రాన్స్‌జెండర్ - రాష్ట్రపతికి పైట కొంగుతో దిష్టితీసి...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (13:55 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ పురస్కారాలను 2021 సంవత్సరానికి మంగళవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ట్రాన్స్‌జెండ‌ర్‌, జాన‌ప‌ద నృత్యకారిణి మాతా బీ మంజ‌మ్మ జోగ‌తి కూడా ఉన్నారు. ఈమె పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 
 
క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్యక్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా మంజ‌మ్మ జోగ‌తి గుర్తింపు పొందారు. అవార్డు అందుకునే స‌మ‌యంలో మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన రీతిలో ఆశీర్వదించారు. తన పైట కొంగుతో మూడుసార్లు రాష్ట్రపతికి దిష్టితీసి, ఆ తర్వాత పాదాబివందనం చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి, మంజ‌మ్మ జోగ‌తి న‌వ్వుతూ ఏదో మాట్లాడుకోవ‌టం క‌నిపించింది. మంజ‌మ్మ జోగతి హావ‌భావాలకు ముగ్ధులై అక్కడున్న వారంతా చిరున‌వ్వులు చిందించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments