Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Train18 : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలేంటి?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:18 IST)
ప్రస్తుతం దేశంలో అత్యంత వేగంతో నడిచే రైళ్ళ జాబితాలో శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇపుడు ట్రైన్ 18 లేదా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చి చేరింది. ఈ రైలు దేశంలోనే అత్యంత వేగవంతంగా నడిచే రైలుగా గుర్తింపుపొందింది. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయనుంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై దూసుకెళుతుంది. ఈనెల 15వ తేదీ నుంచి పట్టాలపైకి రానున్న ఈ రైలు ప్రత్యేకతలను పరిశీలిస్తే, 
 
ఈ రైలును తొలుత ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడుపనున్నారు. 752 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల్లో చేరుకుంటుంది. ఉదయం 6 గంటలకు ఢిల్లీ స్టేషన్‌లో బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. అలాగే, తిరుగు ప్రయాణంలో వారణాసిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 11 గంటలకు వచ్చి చేరుతుంది. 
 
ఈ రైలు కేవలం రెండు స్టేషన్‌లలోనే ఆగుతుంది. ఒకటి కాన్పూర్, రెండోది ప్రయాగ్ రాజ్ (అలహాబాద్). ఈ రైలులో ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు మాత్రమే ఉన్నాయి. గతంలో ఢిల్లీ - వారణాసిల మధ్య ఛైర్‌కార్‌లో ప్రయాణ చార్జీని రూ.1850గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ ప్రయాణ టిక్కెట్ ధర రూ.3520గా ఉండేవి. కానీ ఇపుడు గణనీయంగా తగ్గించారు. 
 
కొత్తగా నిర్ణయించిన ప్రయాణ చార్జీల మేరకు న్యూఢిల్లీ నుంచి వారణాసికి ఛైర్‌కార్‌లో రూ.1760, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రూ.3310గా నిర్ణయించారు. అలాగే, వారణాసి నుంచి ఢిల్లీకి ఛైర్‌కార్‌ చార్జీని రూ.1700గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ చార్జీని రూ.3260గా నిర్ణయించారు. 
అదేవిధంగా ఢిల్లీ - కాన్పూర్‌ మధ్య ప్రయాణ చార్జీ రూ.1090 (ఛైర్‌కార్), రూ.2105 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా నిర్ణయించారు. 
ఢిల్లీ - ప్రయాగ్ రాజ్‌ల మధ్య ప్రయాణ చార్జీ రూ.1395 (ఛైర్‌కార్), రూ.2750 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా నిర్ణయించారు. 
కాన్పూర్ - ప్రయాగ్‌రాజ్‌ల మధ్య ప్రయాణ చార్జీని రూ.595 (ఛైర్‌కార్), రూ.1170 (ఎగ్జిక్యూటివ్ క్లాస్), కాన్పూర్ - వారణాసి ప్రయాణ చార్జీని రూ.1020 (ఛైర్‌కార్), రూ.1815 (ఎగ్జిక్యూటివ్ క్లాస్)గా ఖరారు చేశారు.
 
భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ట్రైన్ 18 ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ భోజనం పంపిణీ చేయాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించింది. ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడపనున్న ఈ రైలులో ప్రయాణించే వారికి అలహాబాద్ నగరంలోని ఉన్నతస్థాయి రెస్టారెంట్ నుంచి అల్పాహారం, కాన్పూర్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించి వడ్డించనున్నారు. 
 
అలాగే, ఈ రైలులో వైఫై, లెడ్ స్క్రీన్స్ (ఇన్ఫోటైన్‌మెంట్), జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, మాడ్యులర్ టాయిలెట్స్, బయో వాక్యూమ్ ఫ్లషెష్, దివ్యాంగులకు ఫ్రెండీ టాయిలెట్స్, ఇంటర్‌కనెక్టర్ రొటేషనల్ సీట్లు (ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో మాత్రమే) బోగీకి బోగీకి మధ్య ఆటోమేటిక్ డోర్లు, మినీ పాంట్రీ వంటి అత్యాధునిక సౌకర్యాలను ఇందులో కల్పించారు. 
 
తొలుత ఈ ట్రైన్ పేరు ట్రైన్ 18గా పిలుస్తూ వచ్చారు. చెన్నైలోని రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీలో ఈ రైలును పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 18 నెలల కాలంలో పూర్తిచేశారు. అందుకే ఈ రైలుకు ట్రైన్ 18గా పేరు వచ్చింది. ఆ తర్వాత దేశ ప్రజల నుంచి సలహాల మేరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చారు. ఈ రైలును ఈనెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments