Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సవాలు.. అలిసిపోయారు.. రైల్వే ట్రాక్‌పై నిద్రపోయారు.. అంతే..?

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:59 IST)
తమిళనాడు తిరువారూర్‌లో రైలు పట్టాలపై నిద్రిస్తున్న ముగ్గురు యువకులను రైలు ఢీకొని మృతి చెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని ముత్తుపేటైలో ఓ అమ్మవారి ఆలయం ఉంది. ప్రస్తుతం ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతుండటంతో ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
ఈ ఉత్సవాలకు హాజరైన ముగ్గురు యువకులు రాత్రి అలసట కారణంగా రైల్వే ట్రాక్‌పై నిద్రించారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3:30 గంటలకు తాంబరం నుంచి సెంగోట్లైకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ట్రాక్‌పై నిద్రిస్తున్న యువకులపైకి దూసుకెళ్లడంతో ఆ ముగ్గురు మృతి చెందారు.
 
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రైలు ఢీకొన్న ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండుగకు వచ్చిన ముగ్గురు యువకులు పట్టాలపై పడుకుని రైలు ఢీకొని మృతి చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments