'వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టయింది' ఆ గ్రామ ప్రజల తంతు. పెళ్లి కొడుకుని చూసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లాలో గల ఖట్ ఖట్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఖట్ ఖట్ గ్రామానికి చెందిన మనీషా అనే యువతికి రోహతక్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి ఆచారం ప్రకారం వధువు ఇంటికి వరుడు వచ్చాడు. ఆయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. వధువు ఇంటికి వరుడు భారీ ఊరేగింపుతో వచ్చాడు. వరుడికి గ్రామపెద్దలు జయమాలా క్రతువు నిర్వహిస్తుండగా, గ్రామస్థులంతా వరుడుని చూసేందుకు ఎగబడ్డారు.
ఈ క్రమంలో అనేక మంది ఇటి బాల్కనీలోకి ఎక్కారు. అనేక మంది ఒక్కసారిగా ఎక్కడంతో బాల్కనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బాల్కనీ విరిగి దానికింద నిల్చొనివున్నవారిపై పడింది. దీంతో పురుషులు, మహిళలతో పాటు మొత్తం 16మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అలాగే, పెళ్లి ఫోటోలు తీసేందుకు వచ్చిన ఫోటోగ్రాఫర్లు సైతం గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు.