Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో సెంచరీ కొట్టిన టమోటా ధర

Webdunia
మంగళవారం, 27 జూన్ 2023 (18:17 IST)
నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటివరకు కిలో రూ.20, రూ.30గా ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర సెంచరీ కొట్టేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తీరు కనిపిస్తోంది. అయితే, టమాటాను అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటం, సరఫరాలో అంతరాయమే ఇందుకు కారణాలుగా వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.
 
దేశ రాజధానితో పాటు ప్రధాన మెట్రో నగరాల్లో కిలో టమాటా ధర రూ.80కి చేరింది. ఉత్తరోదేశ్‌లోని కాన్పూర్‌లో హోల్‌సేల్ ధర కిలో రూ.80 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. రిటైల్ మాత్రం రూ.100 దాటింది. కాన్పూరుకు టమాటాలు ఎక్కువగా బెంగళూరు నుంచి వస్తాయని.. రానున్న రోజుల్లో ఇవి కిలో రూ.150కి చేరుకోవచ్చని స్థానిక కూరగాయల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 
 
అటు ముంబైలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. హోల్‌సేల్‌లోనే కిలో ధర రూ.50 పలుకుతోంది. బెంగళూరులోనూ మొన్నటివరకు రూ.30గా ఉన్న వీటి ధర ఇప్పుడు రూ.100కి చేరింది. తెలంగాణలోనూ వర్షాలు మొదలు కావడంతో ఇక్కడ కూడా టమాటా ధరపై ప్రభావం పడింది. హైదరాబాద్ నగరంలో నాణ్యమైన టమాటా ధర రూ.100 దాటింది.
 
దేశంలో టమోటా సాగు మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్లలో అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఇటీవల ప్రతికూల వాతావరణం కనిపించింది. మొన్నటివరకు తీవ్ర వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినప్పటికీ.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తింటోంది. దీంతో టమోటా దిగుబడి లేక ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments