ఖాకీ క్రౌర్యం : ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను బెల్టుతో చితకబాదిన ఎస్ఐ!

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (09:39 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో ఓ మహిళపై ఎస్ఐ తన ప్రతాపాన్ని చూపించాడు. తనపై దాడి చేసినవారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను దుర్భాషలాడుతూ బెల్టుతో చితకబాదాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో మహిళ పట్ల ఎస్.ఐ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడినట్టు తేలింది. దీంతో ఎస్.ఐపై బదిలీవేటు పడింది. ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి అనే మహిళ ఆటో నడుపుతూ జీవిస్తోంది. శనివారం ఆమె ఇంటి గార్డెన్‌లోకి గేదెలు వచ్చి ధ్వంసం చేశాయి. దీంతో ఆమె గేదెలు బయటకు వెళ్లకుండా తాళం వేసింది. విషయం తెలిసిన గేదెల యజమానులు ఆమెతో వాగ్వివాదానికి దిగి, దాడి చేసి గేదెలను తీసుకెళ్లిపోయారు.
 
దీంతో బాధితురాలు వాణి ఫిర్యాదు చేసేందుకు ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అదేసమయంలో పూజలు చేసేందుకు స్టేషన్ గదులను శుభ్రం చేస్తున్నారు. విషయం తెలియని ఆమె నేరుగా లోపలికి వెళ్లడంతో చూసిన ఎస్ఐ ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెను దుర్భాషలాడాడు. ఎందుకలా తిడుతున్నారని ప్రశ్నించడంతో మరింత ఊగిపోయిన ఎస్ఐ ప్రకాశ్ కుమార్ బెల్టుతో ఆమెపై దాడిచేశాడు.
 
ఎస్ఐపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్తే ఆయన లేరని తెలిసి మళ్లీ స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగింది. విషయం తెలిసిన సీఐ సురేంద్రనాథ్ రెడ్డి స్టేషన్‌కు చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె ధర్నా విరమించింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ విచారణ జరిపించి ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments