Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురైలో విషాదం : విషవాయువు సోకి ముగ్గురి దుర్మరణం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:44 IST)
ఆలయాల నగరంగా ప్రసిద్ధికెక్కిన మదురైలో ఘోరం జరిగింది. విషవాయువు సోకి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకును శుభ్రపరుస్తుండగా విష వాయువులు వెలువడి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులో కార్పొరేషన్ మురికినీటి ట్యాంకులో (పంపింగ్ స్టేషన్) విద్యుత్ మోటార్ రిపేర్ అయింది. దీంతో మురికి నీరు పంపింగ్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న నలుగురు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మోటారును బయటకు తీసి రిపేరు చేస్తున్నారు. 
 
అదేసమయంలో ట్యాంకును శుభ్రం చేస్తున్న శరవణన్ అనే వ్యక్తి విషవాయువు సోకి ట్యాంకులో పడిపోయాడు. దీన్ని గుర్తించిన మరో ఇద్దరు అతడిని రక్షించేందుకు ట్యాంకులోకి దిగారు. వారు కూడా విషవాయువు సోకడంతో ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments