Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయమన్నారు : ఢిల్లీ మాజీ సీపీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:53 IST)
నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ తమపై కూడా ఒత్తిడి వచ్చిందని ఆ కేసును విచారించిన ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించారు. దిశ కేసులోని నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 
 
అయితే, ఎపుడో జరిగిన నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి మాత్రం ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు. పైగా, వీరంతా తీహార్ జైలులో దర్జాగా తిని తిరుగుతున్నారు. అయితే, తెలంగాణలో జరిగిన దిశా ఘటనలో కొన్నిరోజులకే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాడు నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మాజీ సీపీ నీరజ్ కుమార్ తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
 
తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్‌కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments