ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్తూ.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదంటూ చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తాజాగా ఏపీ సర్కారు సీబీఐకు జారీచేసిన సమ్మతి ఉత్తర్వుల రద్దుపై నోరు విప్పారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అరుణ్ జైట్లీ.. ఏపీ సీఎం భయపడుతున్నారు.. అందుకే సీబీఐ కోసం జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దు చేశారంటూ కామెంట్ చేశారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారని ఏపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే వున్నా.. అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదనే విషయాన్ని జైట్లీ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే భయంతోనే చంద్రబాబు సర్కారు సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని ఎద్దేవా చేశారు.