Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊళ్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు రాకూడదంటే ఎలా?: ఉండవల్లి

Advertiesment
ఊళ్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు రాకూడదంటే ఎలా?: ఉండవల్లి
, శనివారం, 17 నవంబరు 2018 (12:59 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో అనుమతిని ఉపసంహరిస్తూ.. ఏపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను ఉండవల్లి తప్పుబట్టారు. సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటేనే సీఎం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. 
 
అంతేగాకుండా.. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే తొలిసారిగా జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. తమపై విచారణ జరుగకూడదనే విధంగా సీఎం జీవో జారీ చేశారని తప్పుబట్టారు. 
 
ఊళ్లో అందరూ మంచోళ్లేనని.. పోలీసులు ఊర్లోకి రావాల్సిన అవసరం లేదంటే ఎలా అంటూ ఉండవల్లి ప్రశ్నించారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు.. ప్రజా ప్రతినిధులపై ఐటీ దాడులు జరిగితే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. చంద్రబాబు తన వెనుకున్న కోటీశ్వరుల తరపున వున్నారా.. ప్రజల పక్షంలో వున్నారా అని అడిగారు.
 
తప్పు చేయని పక్షంలో దర్యాప్తు సంస్థలను పంపితే మిగులుతారా.. ప్రధాని ఏం చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని.. మోదీ అనుకుంటే తన పరిధిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చని అరుణ్ కుమార్ తెలిపారు. చంద్రబాబు రాజకీయ సమర్థతపై పూర్తి నమ్మకం వుందని.. దేశంలోని అన్నీ పార్టీలతో కలిసిన వారు చంద్రబాబు ఒక్కరేనని ఉండవల్లి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరిష్టం వారిది.. వస్తే రావొచ్చు.. రాకపోతే పోవచ్చు.. బాలయ్య