సెల్ఫీలు తీసి పంపితే బతికిపోయినట్టే.. లేదంటే : కర్నాటక ఏం చెబుతోంది?

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (09:42 IST)
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో హోం (సెల్ఫ్) క్వారంటైన్‌లో వారందరికీ కర్నాటక ప్రభుత్వం అత్యంత కీలకమైన ఆదేశాలు జారీచేసింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు హోం క్వారంటైన్‌లలో ఉండేవారంతా ఖచ్చితంగా సెల్ఫీలు తీసి ప్రభుత్వానికి పంపాలంటూ ఆదేశాలు జారీచేసింది. అలా చేయని పక్షంలో ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలిస్తామని హెచ్చరించింది. 
 
దీనికి కారణం లేకపోలేదు. హోం క్వారంటైన్‌లలో ఉండేవారిలో చాలా మంది నింబంధనలకు తూట్లుపొడిచి యధేచ్చగా తిరుగుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ప్రతి రోజు 14 సెల్ఫీలు పంపాలని ఆదేశించింది. 
 
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యలో సూచించిన నంబరుకు వీటని పంపాలని, నిద్రిస్తున్న సమయం ఇందుకు మినహాయింపని పేర్కొంది. ఇలా చేయని వారిని వెంటనే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించింది. 
 
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెల్ఫీని షేర్ చేయాలంటే తొలుత జీపీఎస్‌ను ఆన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉన్నవారు పంపే సెల్ఫీలను ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆ ఫొటోల్లో తేడా ఉందని అధికారులు గుర్తిస్తే వెంటనే వారింటికి చేరుకుని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments