Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నెలలుగా సీనియర్ల ర్యాగింగ్ - రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (08:34 IST)
అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలో ఓ దారుణం జరిగింది. నాలుగు నెలలుగా ర్యాగింగ్ చేస్తున్న సీనియర్ విద్యార్థుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ విద్యార్థి హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి ఇపుడు ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థి పేరు ఆనంద్ శర్మ. 
 
ఆనంద్ శర్మ దిబ్రూగఢ్ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే, గత నాలుగు నెలలుగా సీనియర్ విద్యార్థులు అతని ర్యాగింగ్ చేస్తున్నారు. ఇవి రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వేధింపులకు భయపడిన ఆ విద్యార్థి సీనియర్ల బారి నుంచి తప్పించుకునేందుకు హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. ఈఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆనంద్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
ఈ ఘటనపై ఆనంద్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆనంద్‌ను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్ విద్యార్థులను అరెస్టు చేశారు. వీరు గత నాలుగు నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధించినట్టు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, తన కుమాడి నుంచి డబ్బులు, మొబైల్ ఫోన్ లాక్కుని హింసించేవారని, మద్యం తాగించి అభ్యంతరకరమైన ఫోటోలను తీసేవారని, ఆపై వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించే వారని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో రాహుల్ చైత్రీ అనే మాజీ విద్యార్థి కూడా ఉన్నాడు. నేర పూరిత కుట్ర, ఓ వ్యక్తిని అన్యాయంగా అడ్డుకోవడం, దోపిడీకి పాల్పడటం, హత్యాయత్నం, చట్టవిరుద్ధంగా సమావేశం కావడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments