Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మకర సంక్రాంతి వేళ మీ ఇంటికి పండుగ వైభవం అందించండి

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (23:02 IST)
మనం 2023 సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మకర సంక్రాంతి పండుగకు కౌంట్‌డౌన్‌ కూడా అంతే వేగంగా కొనసాగుతుంది. తమ ప్రియమైన వారితో పండుగను వేడుక చేయడానికి, సంతోషం విస్తరించడానికి, సోషలైజింగ్‌కు దీనిని ఓ అవకాశంగా ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఈ పండుగల వేళ మన ఇంటికి సరిగా అలంకరించకపోతే ఆ వేడుకలు అసంపూర్ణంగానే ఉంటాయి. మకర సంక్రాంతి అంటే ప్రజలు విభిన్నమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. తమ ఇళ్లకు కొత్త రూపాన్ని ఇవ్వాలనీ కోరుకుంటారు. కాబట్టి, మీ ఇంటిని పునరుద్ధరించడానికి, సంతోషకరమైన పండుగను స్వాగతించడానికి ఇది సరైన సమయం.

 
అయితే, మనలో చాలామంది హోమ్‌రెనోవేషన్‌ ప్రాజెక్ట్‌లనగానే అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యమూ కలిగిస్తాయని భావిస్తుంటారు. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్‌ డిజైన్‌ ఆలోచనలతో తక్కువ సమయంలో గృహాలను అందంగా, విలాసవంతంగా మార్చవచ్చు. మీ బడ్జెట్‌కు తగినట్లుగా, అతి సులభంగా నిర్వహించగలిగిన కొన్ని ఇంటి పునర్నిర్మాణ  సూచనలు

 
డిజైనర్‌ ఫాల్స్‌ సీలింగ్‌- మీ గదికి ఇన్‌స్టెంట్‌ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది
మీ ప్రాధాన్యత ఎలాంటిది అయినా మీ కోసం ఓ డిజైనర్‌ సీలింగ్‌ అయితే మీ కోసం ఉంది. ఇది ఎంత సింపుల్‌గా ఉంది, ఎంత వేగంగా ఈ సీలింగ్‌ పూర్తి చేస్తామన్నది కీలకం. కొన్ని సందర్భాలలో ఇంట్లో రంగులు వేయడం పూర్తి చేయడం కంటే వేగంగా ఈ డిజైనర్‌ సీలింగ్‌లు పూర్తి అవుతాయి. ఇక ఈ డిజైనర్‌ సీలింగ్‌లో లైట్లను కూడా అమరిస్తే, మీ ఇల్లు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అయితే మనకు ఈ పునరుద్ధరణ సమయంలో భాగస్వామిగా మారేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ భాగస్వామిని కనుగొనడం ఎలా?

 
మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామిగా సెయింట్‌ గోబైన్‌ జిప్రోక్‌ నిలవవచ్చు. నేడు అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన సీలింగ్‌ డిజైన్లను అందించడం ద్వారా మీ సమస్యకు తగిన పరిష్కారం చూపుతుంది. మీ భావోద్వేగాలు, బడ్జెట్‌ మరియు గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని ఇవి అందించనున్నాయి. జిప్సం సీలింగ్‌ ఖర్చు కేవలం ఒక అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా మరియు కూలీ ఖర్చులు. ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 90-110 రూపాయల నడుమ ఉంటుందని భావించవచ్చు. అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్‌ డిజైనర్ల పై ఆధారపడి ఉంటుంది. మీ లివింగ్‌ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా  జిప్రోక్‌ మీకు చేస్తుంది. డ్రైవాల్‌ పార్టిషన్‌తో అత్యంత ఆకర్షణీయమైన అందాలను సొంతం చేసుకోండి.

 
మీ ఇంటిని రీమోడల్‌ చేయడం లేదా పార్టిషన్‌ చేయాలనుకుంటే అదనపు బెడ్‌రూమ్‌/స్టడీ ఏరియా/పూజా ఏరియాలలో డ్రై వాల్‌ పార్టిషన్‌ ఓ చక్కటి ఎంపిక. కేంద్రీకృత డిజైన్‌టీమ్‌ సహాయంతో జిప్రోక్‌ ఇండియా మీకు డ్రైవాల్‌ పరిష్కారాలతో మద్దతు అందిస్తుంది. ఇవి మీ ఇంటి పునరుద్ధరణ అవసరాలకు తగిన మద్దతు అందించడంతో పాటుగా అతి తక్కువ ధరలలో అధిక మన్నికనూ అందిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా సిమెంట్‌, ఇటుక గోడలకు ఆదరణ తగ్గుతూ వస్తుంది. నీటి కారణంగా డ్యామేజీకావడం, క్రాక్స్‌, ఫ్లాకింగ్‌ వంటి సమస్యల వల్ల చూడటానికి కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. వీటికి పరిష్కారంగా జిప్సం డ్రై వాల్స్‌ నిలుస్తున్నాయి. ఇవి పర్యావరణ అనుకూలంగా ఉండటంతో పాటుగా గోడలకు సంబంధించి సుదీర్ఘమైన పరిష్కారాలనూ అందిస్తున్నాయి. ఇటుక, సిమెంట్‌ గోడలతో పోలిస్తే  జిప్సం గోడల నిర్మాణం వేగంగా జరుగుతుంది. అతి తక్కువ కార్మికుల అవసరం కూడా ఉంటుంది. సమకాలీన ఇళ్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాంకేతికతలలో డ్రైవాల్‌ పోర్షన్‌ నిలుస్తుంది. శబ్దాలను ఇవి అడ్డుకోవడంతో పాటుగా అగ్నిని సైతం తట్టుకునే లక్షణాలను కలిగి ఉంది.

 
ప్రీమియం లుక్‌ కోసం ఫ్లోరింగ్‌లో పెట్టుబడి పెట్టండి
గది అందంగా ఉండాలంటే ఫ్లోరింగ్‌ కూడా అందంగా ఉండాలి. అయితే చాలామంది దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఇంటిని రీమోడలింగ్‌ చేసేటప్పుడు ఫ్లోరింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఫ్లోరింగ్‌కు భారీ పెట్టుబడిపెట్టకుండానే పునరుద్ధరించడిన లుక్‌ కావాలనుకుంటే కార్పెట్‌/రగ్‌ జోడించవచ్చు. మీ ఇంటికి సరికొత్త అందాలను అతి తక్కువ సమయంలోనే ఇది అందిస్తుంది. వీటితో పాటుగా ఇండోర్‌ ప్లాంట్స్‌, ఫ్రేమ్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌ అప్‌డేట్‌ చేయడం కూడా చేయవచ్చు.
 
అతిథుల రాకతో ఈ పండుగ సీజన్‌లో మీ ఇల్లు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఈ మకర సంక్రాంతి వేళ మీ బంధువులు, స్నేహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం లేదంటే, రాబోతున్న వివాహ సీజన్‌ కోసం సిద్ధమవుతున్న వేళ ఇంటికి రంగులు వేయించడం ద్వారా కొత్త అందాలను అందించాలనుకుంటారు. అయితే ఈ సూచనలు పాటిస్తే అనుకూలమైన ధరలలో సౌకర్యవంతంగా మీ ఇంటిని తీరిదిద్దుకోవడంతో పాటుగా వినియోగించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments