Webdunia - Bharat's app for daily news and videos

Install App

తబ్లిగీ జమాత్ వ్యవహారంపై సీబీ'ఐ' అవసరం లేదు: కేంద్రం

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (20:14 IST)
తబ్లిగీ జమాత్ పై ఇన్నాళ్లూ రకరకా ఆరోపణలు చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

తబ్లిగీ జమాత్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు, ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్య వైఖరే కారణమని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణలో భాగంగా కేంద్రం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాము భావించడం లేదని స్పష్టం చేసింది. 
 
చట్టాన్ని అనుసరించి, రోజువారీ విధానంలో దర్యాప్తు జరుగుతోందని, నిజాముద్దీన్ మర్కజ్ కు సంబంధించిన ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కీలక దశలో ఉందని కేంద్రం వివరించింది.

నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దర్యాప్తు పూర్తవుతుందని భావిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ జోక్యం అవసరంలేదని అనుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments