Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్..సర్వత్రా ఉత్కంఠ

నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్..సర్వత్రా ఉత్కంఠ
, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (05:42 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు శుక్రవారం హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఏమిటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సాధారణంగా జగన్ మోహన్ రెడ్డి అయితే సమీక్షలు లేకపోతే అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఈసారి కూడా బిజీ బిజీగా షెడ్యూల్ ఉంది. పైగా వ్యక్తిగత హాజరు మినహాయింపుకోసం హైకోర్టులో పిటిషన్ ఉండటంతో జగన్ తరపు లాయర్లు కోర్టులో ఆప్సెంట్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు.

ఈసారి కూడా అదే చేస్తారని అనుకున్నారు. కానీ హైకోర్టులో సీబీఐ కేసుల్లో మాత్రమే హాజరు మినహాయింపు పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కానీ రెండు వారాల క్రితం ఈడీ కేసుల్లోనూ కచ్ఛితంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది.

దీనిపై గత వారం హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ మళ్లీ వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత దాఖలు చేయలేదు. రెండు వారాల క్రితం ఈడీ కోర్టు జనవరి 31న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కానీ గత వారం హాజరుకాలేదు. సీబీఐ కోర్టు శుక్రవారం హైదరాబాద్‌లో హాజరుకాబోతున్నారు. 
 
రాజమండ్రి పర్యటన వాయిదా
సీఎం జగన్‌ రాజమండ్రి పర్యటన వాయిదా పడింది. ఆయన శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేశారు. హైదరాబాద్ పర్యటన తర్వాత జగన్ రాజమండ్రిలో శనివారం పర్యటించనున్నారు.

దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. కాగా సీఎం జగన్ శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరకాబోతున్నారు. గురువారం సాయంత్రం వరకూ ఆయన హైదరాబాద్ పర్యటన ఖరారు కాలేదు.

శుక్రవారం రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించాలనే షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేశారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

దీంతో ఆయన కోర్టుకు వెళ్లరు అని అనుకున్నారు. కానీ గురువారం సాయంత్రం సమయంలో రాజమండ్రి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సీఎంవో ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధి అవకాశాలు ఎలా మెరుగుపరుస్తారు?: పవన్‌