Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధ్వంస సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోంది: మోడీ

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:59 IST)
విధ్వంసకర సిద్ధాంతాలను చూసి ప్రపంచం భయపడుతోందని, ఉగ్రవాద శక్తులు తాత్కాలికంగా ఆధిపత్యం చెలాయించొచ్చేమో కానీ శాశ్వతంగా కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్‌ ఆలయానికి చెందిన పలు ప్రాజెక్టులను మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధ్వంసం కోసం ప్రయత్నించే శక్తులు, ఉగ్రవాదం ద్వారా సామాజ్య్రాలను సృష్టించే సిద్ధాంతాలను అనుసరించే వారి ఉనికి శాశ్వతం కాదని, వారు మానవత్వాన్ని ఎక్కువ కాలం అణచివేయలేరని స్పష్టం చేశారు.

ఇటువంటి సమయంలో ఈ సోమనాథ్‌ దేవాలయం ప్రపంచానికి ఉత్తమమైన ఉదాహరణ అని, భరోసాగా ఉంటుందని అన్నారు. గతంలో అనేకసార్లు ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నా, నేడు నూతనంగా ఆధునీకరించబడిందని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను ఇటీవల తాలిబన్లు వశపరుచుకున్న నేపథ్యంలో మోడీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశంలో మతపరమైన పర్యాటకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments