Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇదే...

Advertiesment
T20 World Cup 2021
, గురువారం, 19 ఆగస్టు 2021 (20:11 IST)
యూఏఈ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఈ మెగా టోర్నీ అక్టోబరు 17వ తేదీన ప్రారంభమై నవంబరు 14వ తేదీతో ముగియనుంది. యూఏఈ, ఒమన్‌ వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 
 
ముగ్గురు ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్లతో కలిపి టి20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే మొత్తం 15 మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టీ20 స్పెషలిస్టులుగా పేరున్న మార్కస్ స్టొయినిస్, కేన్ రిచర్డ్‌సన్ కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. 
 
వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో ఐసిసి మెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో సక్సెస్‌ఫుల్ టీమ్ అనిపించుకున్న ఆస్ట్రేలియా 2007లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెల్చుకోలేదు.
 
ఆస్ట్రేలియా జట్టు : 
ఆరోన్ ఫించ్ (కెప్టేన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్ల జాబితాలో డాన్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కపిల్‌దేవ్ సరసన మహ్మద్ సిరాజ్! 39 యేళ్ల నాటి రికార్డు సమం