Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అల్లుడు అత్యాచారం చేస్తుంటే వీడియో తీసిన మామ, ఆపై అతడు కూడా...

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (11:54 IST)
పదో తరగతి చదివే బాలికకు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన ఘజియాబాదులో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే... సమీర్ అనే యువకుడు ఆటోమొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అతడి షాపుకి సమీపంలో 15 ఏళ్ల వయసున్న పదోతరగతి బాలిక కుటుంబసభ్యులతో వుంటోంది.
 
నెల రోజుల క్రితం సమీర్ బాలికతో మాటలు కలిపాడు. ఆ మాటలు స్నేహానికి దారితీశాయి. మార్చి 11వ తేదీన ఆమెను తన షాపు వద్దకు రావాలని కోరాడు. ఆమె రాగానే మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. షాపులోనే ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అక్కడే వున్న సమీర్ మామ దీపక్ ఆ అత్యాచార దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియో చూపి అతడు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం... విషయాన్ని ఎవరికైనా చెబితే ఆ వీడియోలను నెట్లో పెడతామని బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ వారే ఫోన్ చేసి... ఆ వీడియోలను నీ కళ్లెదుటే డిలిట్ చేస్తాం రమ్మని చెప్పారు. వారి మాటలు నమ్మి బాలిక అక్కడికి వెళ్లగానే మరోసారి ఆమెపై అఘాయిత్యం చేశారు. మరో స్నేహితుడిని పిలిచి అతడితోనూ చేయించారు.
 
ఇంటికి వచ్చిన బాలిక రెండ్రోజుల పాటు అన్నం తినలేదు. తన ఆరోగ్యం బాగాలేదని తల్లికి చెప్పడంతో ఆమె గట్టిగా నిలదీసింది. దాంతో జరిగిన విషయాన్ని చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై సెక్షన్ 376డి, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments