కుప్పింటాకులో ఔషధ గుణాలు పుష్కలంగా వున్నాయి. కుప్పింటాకులోని అన్నీ భాగాల్లో ఔషధ గుణాలున్నాయి. జలుబు, కీళ్ల వాపును తగ్గిస్తుంది. దగ్గును నియంత్రిస్తుంది. కుప్పింటాకును బాగా పేస్టులా చేసుకుని అందులో పసుపు చేర్చి గాయం తగిలిన చోట రాస్తే గాయం త్వరగా మానిపోయింది. కుప్పింటాకును దద్దుర్లున్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. వాత సంబంధిత రోగాలు, ఆస్తమా, ఉదర సంబంధిత రుగ్మతలు, కీళ్ల నొప్పులు తొలగిపోతాయి.
అలాగే కడుపులో వుండే నులిపురుగులు నశిస్తాయి. చర్మ సంబంధిత వ్యాధులుండవు. కుప్పింటాకులను బాగా మరిగించి.. కాస్త కషాయంలా తీసుకుంటే.. మలబద్ధకం ఉండదు. శరీర నొప్పులను తొలగించేందుకు కుప్పింటాకును బాగా నూరి.. కొబ్బరి నూనెతో మరిగించి శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కుప్పింటాకు పేస్టును ముఖానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.