Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26న భారత్ బంద్‌కు తెదేపా సంపూర్ణ మద్దతు : అచ్చెన్నాయుడు

Advertiesment
26న భారత్ బంద్‌కు తెదేపా సంపూర్ణ మద్దతు : అచ్చెన్నాయుడు
, మంగళవారం, 23 మార్చి 2021 (12:41 IST)
కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలతో పాటు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీ శాఖ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 
 
కర్షక, కార్మిక, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఏనాడూ వెనుకంజ వేయదని, అందువల్ల ఈ పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసేందుకు పోస్కోతో ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని డిమాండ్ చేశారు. 
 
చీకటి ఎజెండాతో కార్మికులను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. మోటార్లకు మీటర్లను బిగించే నిర్ణయాన్ని జగన్ రెడ్డి వెనక్కు తీసుకోవాలన్నారు. నయవంచనకు, నమ్మక ద్రోహానికి మారుపేరుగా వైసీపీ ఉందని విమర్శించారు. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా అంటూ అచ్చెన్నాయుడు నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో 700 మంది బడిపిల్లలకు కరోనావైరస్, 10వ తరగతిలోపు బడులన్నీ మూసేస్తే మంచిది