Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏం గుర్తించారని నోటీసులిచ్చారు : సీఐడీని ప్రశ్నించిన హైకోర్టు

Advertiesment
Amaravati Land scam Case
, శుక్రవారం, 19 మార్చి 2021 (17:40 IST)
రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాను, టీడీపీ సభ్యులకు వ్యతిరేకంగా పాల్పడుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేశారన్నారు. 
 
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 12న సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో అరెస్టుతో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మంగళగిరి సీఐడీ పోలీస్‌ స్టేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. 
 
ఇదే వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 
 
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అలాగే నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదించారు. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ జాస్తి నాగభూషణం వాదనలు వినిపించారు. 
 
చంద్రబాబు, నారాయణపై కేసులో.. స్పష్టమైన ఆధారాలు ఉంటే చూపించాలని సీఐడీని న్యాయమూర్తి కోరారు. ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని న్యాయస్థానం ప్రశ్నించింది. 
 
విచారణ తొలి దశలో వివరాలు చెప్పలేమని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తెచ్చారు. పూర్తి స్థాయి విచారణకు అనుమతి ఇస్తే అన్ని విషయాలు తెలుస్తాయని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: 'దొంగ ఓటు వేసిన టీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామా చేయాలి' - Newsreel