Webdunia - Bharat's app for daily news and videos

Install App

సవతి తల్లి, తన కంటే తక్కువ వయసు, అంతే లొంగదీసుకుని గర్భవతిని చేసాడు

Webdunia
గురువారం, 20 మే 2021 (22:42 IST)
సవతి తల్లి అయినా కన్నతల్లితో సమానమే. తల్లితో సమానంగా భావించాల్సిన ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కొడుకు. ఏకంగా గర్భవతిని చేశాడు. తండ్రికి తెలియకుండా రహస్యంగా ఈ బాగోతాన్ని నడిపించాడు. చివరకు విషయం బయటకు పొక్కుతుందన్న భయంతో అతి దారుణంగా చంపేశాడు. 
 
హర్యానాలోని కర్నాల్ జిల్లా గురుగ్రాం పట్టణానికి చెందిన మన్విందర్‌కు రూపవతికి వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరూ కొడుకులే. పెద్దకుమారుడు దేవేందర్ ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉండేవాడు. చిన్న కొడుకు ధన్విందర్ డిగ్రీ పూర్తి ఇంటి దగ్గరే ఉండేవాడు. 
 
అనారోగ్యంతో రూపవతి చనిపోవడంతో మన్విందర్ రెండవ వివాహం చేసుకున్నాడు. రేచల్ అనే మహిళతో ఈయన వివాహం జరిగింది. రేచల్ స్థానికంగా ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రేచల్ వయస్సు 30 సంవత్సరాలే. మన్విందర్ ఇంటి పట్టున ఉండకుండా వ్యాపార నిమిత్తం బయట తిరుగుతూ ఉండేవాడు. 
 
దీంతో రేచల్ పనిచేసే ఫ్యాక్టరీ దగ్గరకు చిన్న కుమారుడు ధన్విందర్ వదిలిపెట్టేవాడు. కొడుకు వరుసను మర్చిపోయిన ఆ సవతి తల్లి ధన్విందర్‌ను ముగ్గులో దింపింది. మూడునెలల పాటు రహస్యంగా ఈ తతంగం సాగింది. వీరిద్దరిపై మన్విందర్‌కు అనుమానం వచ్చింది.
 
తండ్రికి అసలు విషయం తెలిసిపోతుందేమోనని భయపడ్డాడు చిన్న కొడుకు. అందులోను రేచల్ గర్భవతి కావడంతో మరింత భయానికి గురయ్యాడు. ఎలాగైనా రేచల్‌ను చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. ఫ్యాక్టరీకి తీసుకెళుతూ మార్గమధ్యంలో అటవీ ప్రాంతంలో ఆపాడు. ఆమెను బలవంతంగా చున్నీతో గొంతు నులిపి చంపేశాడు.
 
ఆ తరువాత ఒక చెట్టుకు ఉరివేసి వెళ్ళిపోయాడు. తన సవతి తల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం