Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో పడిపోయిన స్మార్ట్‌ఫోన్.. నోటికి కరుచుకుని తెచ్చిచ్చిన తిమింగలం (Video Viral)

Webdunia
గురువారం, 9 మే 2019 (12:03 IST)
అసలే వేసవి కాలం.. అలా స్నేహితులతో కలిసి నార్వేకు వెళ్లింది... ఓ యువతి. అక్కడ స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న ఆ యువతికి ఆశ్చర్యపోయే ఘటన చోటుచేసుకుంది. 


రష్యన్ నేవీ శిక్షణ ఇచ్చిన తిమింగలం ఆ యువతికి షాకిచ్చింది. ఇంకా ఏం జరిగిందంటే.. మనిష్కా అనే అమ్మాయి స్మార్ట్ ఫోన్ సముద్రంలో పడిపోతే ఆ తిమింగలం ఆ ఫోన్‌ను ఒక్కసారిగా నీటి నుంచి బయటికి తీసి తన నోటి ద్వారా మనిష్కా చేతికి అందించింది. ఈ సీన్ చూసిన వారంతా షాకయ్యారు. 
 
అంతేకాదు.. ఆ తిమింగలం ఫోన్‌ను నీటి నుంచి తీసుకొచ్చి మనిష్కాకు ఇవ్వడానికి సంబంధించిన తతంగాన్నంతా.. ఆమె స్నేహితులు వీడియో తీశారు. అంతేగాకుండా.. హామర్ ఫెస్ట్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోకు 19వేల లైకులు వచ్చాయి. నావిక దళం రక్షణ కోసం సముద్ర జీవులను మచ్చిక చేసుకుని.. శత్రువుల పనిపట్టేందుకు వాటికి శిక్షణ ఇస్తుంటారు. 
 
రష్యా సైన్యం కోసం సముద్ర జీవులకు కొన్ని విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అలా నార్వే పోలీస్ సెక్యూరిటీ సర్వీస్‌ నుంచి శిక్షణ తీసుకున్న తిమింగలం మనిష్కా ఫోను జారి సముద్రంలో పడిపోగా.. దాన్ని టక్కున నీటి నుంచి క్యాచ్ చేసి ఆమెకు అందజేసిందని ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ తిమింగలాలకు బెలుగా వేల్ అని పేరు. ఈ తిమింగలాలు స్పైలుగా పనిచేస్తాయని రష్యన్ నేవీ అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

when animals are kinder than humans

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments