Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ సమయంలోనైనా ఉగ్రదాడులు: ఇంటెలిజెన్స్‌

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (06:31 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం శనివారం అయోధ్యపై చారిత్రక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ దాడులకు ప్రణాళికలు వేసుకున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.

భారీ దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలిపాయి. ఈ మేరకు ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) సంస్థలకు చెందిన  అధికారులు తెలిపారు. దీనిపై ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని మాకు సమాచారం అందింది.

అయోధ్య తీర్పు ఏ రోజైనా వెలువడవచ్చనే వార్తలు బయటకి వచ్చినప్పటి నుంచి జైషే ప్రణాళికల్లో వేగం పెరిగింది.  ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేశాం. ఈ ఉగ్ర సంస్థ పలు కీల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంది. అందులో న్యూ దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లు ప్రధానంగా ఉన్నాయి’ అని తెలిపారు. 

ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉగ్ర మూకలు ఇలాంటి కుట్రలకు ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి. మరోవైపు భారత భద్రతా దళాలు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశాయి.

తాజాగా అయోధ్య తీర్పు వెలువడటంతో మరోసారి దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తం చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments