Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్ కమాండర్ అబ్రార్‌ను హతమార్చిన భారత్ భద్రతా బలగాలు

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (08:25 IST)
పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా అగ్ర కమాండర్ అబ్రార్‌ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. శ్రీనగర్ సమీపంలోని మాలోరా పరింపోరాలో జరిగిన ఎన్‌కౌంటరులో అబ్రార్‌ను చంపేశాయి. 
 
ఈ ఎన్‌కౌంటర్‌పై ఐజీపీ విజయ్ కుమార్ స్పందిస్తూ విచారణలో భాగంగా, అబ్రార్‌ను అదుపులోకి తీసుకున్న జవాన్లు సోమవారం రాత్రి అతను ఏకే-47 రైఫిల్‌ను దాచిన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆయుధాన్ని రికవరీ చేస్తున్న క్రమంలో అబ్రార్ అనుచరుడు తిరగబడి, జవాన్లపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ అనివార్యమైందని వివరించారు. 
 
ఆ ఇంట్లో ఉన్న ఓ విదేశీ ఉగ్రవాది జవాన్లను చూసి, లోపలి నుంచి కాల్పులు ప్రారంభించాడని, అబ్రార్ కూడా తిరగబడ్డాడని, ఆపై జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ మరణించారని, ఆ ఇంటి నుంచి అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ వెల్లడించారు.
 
విదేశీ ఉగ్రవాది కాల్పులు ప్రారంభించిన అనంతరం ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయని, ఆ వెంటనే రాష్ట్ర పోలీసులతో పాటు అదనపు బలగాలను రప్పించి, ఇంటిని చుట్టుముట్టామని అన్నారు. 
 
గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించామని తెలిపారు. హతులైన ఇద్దరు ఉగ్రవాదులూ, గతంలో ఎన్నో దాడులు చేశారని అన్నారు. శ్రీనగర్ హైవేపై జరిగిన బాంబు దాడిలోనూ వీరి ప్రమేయం ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments