Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాహనం వెంటబడ్డ పులిపిల్ల, తొక్కించేసిన గుర్తు తెలియని వాహనం

Advertiesment
Vehicle
, శుక్రవారం, 18 జూన్ 2021 (17:09 IST)
సహజంగా జంతువులు తాము వెళ్లే దారిలోకి వస్తే వాటి వెంటబడతాయి. అలాగే ఓ గుర్తు తెలియని వాహనం వెంటబడింది ఓ పులిపిల్ల. ఈ క్రమంలో ఆ వాహనం నడిపే డ్రైవర్ పులి వాహనం వెంటపడటంతో వేగం పెంచాడు. దీనితో ఆ వాహనాన్ని ఢీకొన్న టైగర్ పిల్ల అక్కడికక్కడే చనిపోయింది.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని NH 43 జాతీయ రహదారిలో ఈ ఘటన జరిగింది. పులి పిల్ల వయస్సు 2 నుండి 4 నెలల మధ్య వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన గురువారం రాత్రి 2 నుంచి 3 గంటల మధ్య జరిగినట్లు చెపుతున్నారు. పులి పిల్ల మృతదేహం రోడ్డు మధ్యలో పడి ఉండటాన్ని గమనించిన బాటసారులు అటవీ శాఖకు సమాచారం అందించారు.
 
సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘున్‌ఘుటి అటవీ ప్రాంతంలో చాలాకాలంగా పులులు సంచరిస్తున్నాయి. ఇవి తరచూ జాతీయ రహదారిని దాటుతాయి. ఎందుకంటే జాతీయ రహదారికి ఇరువైపులా అడవి ఉంది, దీనివల్ల పులులు మరియు వాటి పిల్లలు చాలా ప్రదేశాల నుండి రహదారిపైకి వస్తాయి.
 
జాతీయ రహదారిపై చాలా చోట్ల, నెమ్మదిగా వాహనాలను నడపాలని బోర్డులు కూడా ఉన్నాయి. కాని కొత్తగా నిర్మించిన రహదారిపై ద్విచక్ర వాహనాలపైన కూడా వెళ్తుంటారు. ఆ సమయంలో అడవి జంతువులు వెంటాడుతాయి. దీనితో భయంతో చాలామంది ఆ పరిసర ప్రాంతానికి రాగానే వాహనం వేగాన్ని పెంచేస్తారు. దీనితో పెద్దసంఖ్యలో పెద్ద పులులు ప్రాణాలు కోల్పోతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15 రోజుల్లో నివేదిక కావాలి... ఆర్ఆర్ఆర్ కేసులో స్పీకర్ కార్యాలయం