Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఫక్కీలో కారును ఆపి దంపతులపై కాల్పులు.. ఇద్దరు మృతి

Advertiesment
సినీ ఫక్కీలో కారును ఆపి దంపతులపై కాల్పులు.. ఇద్దరు మృతి
, శనివారం, 29 మే 2021 (10:16 IST)
సినీ ఫక్కీలో రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ దంపతులపై ఇద్దరు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో డాక్టర్‌తో పాటు ఆయన భార్య మరణించారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో జరిగింది. నగరంలోని బిజీ క్రాసింగ్ వద్ద ఈ కాల్పుల ఘటన జరగడం శోచనీయం. సాయంత్రం 4.45 నిమిషాలకు సంఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
క్రాసింగ్ వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. కారుకు అడ్డంగా నిలిచారు. అయితే డ్రైవర్ సీటులో ఉన్న డాక్టర్‌.. కారు విండో తీస్తుండగానే.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న పిస్తోల్‌తో కాల్పులు జరిపాడు. పలు రౌండ్లు కాల్పులు జరిపి.. బైక్‌పై పరారీ అయ్యారు. ప్రతీకారంతోనే ఆ డాక్టర్ దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
డాక్టర్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్న ఆ యువతిని హత్య చేశారు. డాక్టర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి ఆ యువతి సోదరుడిలా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆ యువతి హత్యకు గురైంది. ఈ కేసులో డాక్టర్ భార్యతో పాటు ఆమె తల్లి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనందయ్యను రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు..!