Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలై జిల్లాలో దారుణం : లారీ - సుమో ఢీ.. ఏడుగురి మృత్యువాత

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2023 (13:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని సెంగం పక్రియపాళెం సెంగం బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ, సుమోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. లారీని సుమో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు... సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నేపాల్‌ను భయపెడుతున్న వరుస భూకంపాలు 
 
నేపాల్ దేశాన్ని వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. రెండు రోజు క్రితం ఆ దేశ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందురూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే గడుపుతున్నారు. ఖాఠ్మాండుకు ఉత్తర, ఈశాన్యం దిశగా 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. 
 
తాజా భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు ఇప్పటివరకు అందలేదు. టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్ భూకంపాలు సర్వసాధరణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది. ఈ భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మిలియన్ నిర్మాణాలు కుప్పకూలాయి. అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ప్రపంచంలో నేపాల్ 11వ స్థానం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments