Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రేమ మీ చేతుల్లోనే వుంది.. దయచేసి పాస్ చేసి నా ప్రేమను బతికించండి.. విద్యార్థి వేడుకోలు!!

ఠాగూర్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (09:41 IST)
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాను. ఈ పరీక్షల్లో నా ప్రతిభతో పనిలేకుండా నన్ను పాస్ చేయండి. పదో తరగతి పరీక్షల్లో పాస్ చేసి నన్ను, నా ప్రేమను బతికించండి అంటూ ఓ విద్యార్థి జవాబు పత్రంలో రాశాడు. దీన్ని చూసిన ఉపాధ్యాయుడు షాక్‌కు గురయ్యాడు. కర్నాటక రాష్ట్రంలోని బెళగావిలో జిల్లాలో ఎలాగైనా పాస్ చేయాలని, అపుడే తన ప్రేమ నిలుస్తుందని రాసుకొచ్చాడు. మూల్యాంకనం చేస్తున్న క్రమంలో చూసిన ఉపాధ్యాయుడు అది చూసి షాకయ్యారు. 
 
పదో తరగతి పాస్ అయితేనే తనతో ప్రేమ కొనసాగిస్తానని ప్రియురాలు చెప్పిందని జవాబు పత్రంలో రాసిన విద్యార్థి నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. అమ్మాయి ప్రేమ కొనసాగించాలంటే నేను పాస్ కావాలి అని రాశాడు. దయచేసి తనను పాస్ చేయాలని కోరుతూ ఆన్సర్ షీట్ మధ్యలో రూ.500 పెట్టాడు. ఈ డబ్బుతో టీ తాగాలని, తనను పాస్ చేయాలని అభ్యర్థించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాకెక్కడంతో ఇది కాస్త వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments