Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

Advertiesment
up ward boy steals ear rings

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (18:09 IST)
కొందరి మనుషుల్లో మానవత్వం, కనికరం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఎదుటి వారు ఎలాంటి ఆపద లేదా ప్రమాదంలో ఉన్నప్పటికీ తాము అనుకున్న పనిని, చేయదలచుకున్న పనిని పూర్తి చేస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆస్పత్రిలో పని చేసే వార్డు బాయ్ ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను చికిత్స కోసం తరలించారు. అయితే, ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోలీసులు వచ్చేంత వరకు మృతదేహాన్ని వార్డులోనే ఉంచారు. ఇదే అదునుగా భావించిన వార్డు బాయ్ ఆమె చెవి కమ్మలు తీసేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
వివరాలను పరిశీలిస్తే, యూపీలోని హిరన్ వాడ గ్రామానికి చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తి భార్య శ్వేత (26) శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దీంతో ఆమెను చికిత్స కోసం షామ్లీలోని జిల్లా సంయుక్త ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, శ్వేత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోలీసుల రాకకోసం వార్డులోనే ఉంచారు. 
 
ఆ సమయంలో ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్న విజయ్ తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. వార్డులో ఉన్న శ్వేత మృతదేహం వద్దకు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను చాకచక్యంగా తీసేశాడు. కొంత సమయం తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ సమయంలో నేలపై ఒక చెవి కమ్మను గుర్తించినట్టు పోలీసులకు చెప్పి, దాన్ని వారికి ఇచ్చారు. 
 
అయితే, విజయ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో విజయ్, శ్వేత మృతదేహం చెవుల నుంచి కమ్మలను తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా విజయ్ అప్పటికే అక్కడ నుంచి పారిపోయాడు. 
 
మృతురాలి భర్త సచిన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు విజయ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)