Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

Advertiesment
child marriage

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (14:14 IST)
పలువురు యువతులకు తమకు కాబోయే భర్తలు ఇలా ఉండాలి.. అలా ఉండాలి, మంచి ఉద్యోగం, ఐదు అంకెల జీతం ఉండాలి ఇలా ఎన్నెన్నో కలలు కంటుంటారు. అలాంటిదే ఇక్కడో యువతి తన కాబోయే భర్త ఎలా ఉండాలో పేర్కొంది. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన కనీస అర్హతలంటూ మొత్తం 18 షరుతులను టిండర్ యాప్‌లో పరిచయమైన వ్యక్తికి పంపింది. అతను ఆ జాబితాను రెడిట్‌‍లో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతి షరతులను చూసిన నెటిజన్లు తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. 
 
ఆ యువతి కోరుకుంటున్న ప్రధాన షరతుల్లో ఒకటి.. కాబోయే భర్త వార్షిక వేతనం నెలకు కనీసం రూ.3 లక్షలు డాలర్లు (రూ.2.5 కోట్లు) ఉండాలి. అతను ఉదారంగా ఉంటూ తనను బంగారం చేయాలని, విలాసవంతమైన, ఉన్నతమైన జీవినశైలిలో ఇష్టపడాలని కోరింది ఖరీదైన రెస్టారెంట్లలో భోజనం, వివాహ యాత్రలు వంటివి ఇష్టపడాలని పేర్కొంది. 
 
జీతంతో పాటు తనను గాఢంగా ప్రేమించాలని, తనకే ప్రాధాన్యమివ్వాలని కోరింది. భావోద్వేగ ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, లక్ష్యాలు, క్రమశిక్షణ, కుటుంబానికి విలువివ్వడం, మంచి పరిచయాలు కలిగి ఉండటం వంటి వ్యక్తిగత లక్షణాలను కూడా ఆశించింది. 
 
శారీరకంగా ఫిట్‌గా ఆకర్షణీయంగా, చక్కగా తయారై ఉండాలని స్పష్టంచేసింది. సోషల్ మీడియా ప్రచారం కన్నా గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, లైంగిక క్రమశిక్షథ, విధేయత కలిగివుండాలని పేర్కొంది. గర్భనిరోధక బాధ్యత కూడా అతనే తీసుకోవాలని చెప్పింది. పని మనిషి, వంట మనిషి వంటి వారిని ఏర్పాటు చేసి జీవితాన్ని సులభతరం చేయాలని కూడా జాబితాలో చేర్చింది. 
 
ఈ పోస్ట్‌లో రెడిట్‍లో వైరల్‌గా మారింది. ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి ఆమెను వెంటనే బ్లాక్ చేస్తాడు. అలాంటి వారు టిండర్‌‍లో ఎందుకు ఉంటారు. ఆమె జీవితాంతం పెళ్లికాదు అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్