దేవాలయాల రాష్ట్రం అనే పేరు చెప్పగానే వెంటనే తమిళనాడు రాష్ట్రం గుర్తుకు వస్తుంది. ఇక్కడ వున్నన్ని దేవాలయాలు మరే రాష్ట్రంలోనూ లేవని అంటుంటారు. ఇలాంటి దేవాలయాల పరిస్థితి దీనంగా మారిందని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తం చేసారు.
11,999 దేవాలయాలు ఒక్క పూజ కూడా జరగకుండా క్షీణ దశకు చేరుకున్నాయన్నారు. సంవత్సరానికి 10,000 రూపాయల కన్నా తక్కువ ఆదాయంతో సాగుతున్నవి 34,000. కాగా 37,000 దేవాలయాలలో పూజ, నిర్వహణ, భద్రత మొదలైన వాటికి కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారని చెప్పారు.