Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాడ్‌బరీ ఇండియాకు భారీ షాక్.. సీబీఐ కేసు నమోదు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (16:46 IST)
ప్రముఖ చాక్లెట్ల కంపెనీల్లో క్యాడ్‌బరీ ఒకటి. క్యాడ్‌బరీ ఇండియాకు ప్రస్తుతం భారీ షాక్‌ తగిలింది. తాజాగా క్యాడ్‌బరీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

అవినీతి, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సంస్థకు చెందిన హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌లోని 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం దీనిని మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుస్తారు.
 
2009-11 మధ్య క్యాడ్‌బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ.
 
పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా, మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది.

అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచార అందలేదని సదరు కంపెనీ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments