Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖుష్బూకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వుందో లేదో?

Advertiesment
ఖుష్బూకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వుందో లేదో?
, మంగళవారం, 16 మార్చి 2021 (15:20 IST)
దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అన్నాడిఎంకే, డిఎంకే పార్టీలే ఎప్పుడూ అధికారంలోకి వచ్చి వెళుతుంటాయి. కానీ ఈసారి కొత్తగా కమల్ హాసన్ పార్టీ పెట్టడం, కొంతమంది జతకట్టడం.. కూడా జరిగింది. దీంతో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారుతోంది తమిళ రాజకీయాలు.
 
ఇందులో ప్రధానంగా సినీప్రముఖులు పోటీ చేస్తుండడం మరో చర్చకు దారితీస్తోంది. బిజెపి నుంచి నటి ఖష్భూ పోటీ చేస్తున్నారు. అది కూడా థౌజండ్ పిల్లర్స్ లైట్ నియోజకవర్గం నుంచి ఆమె రంగంలోకి దిగనున్నారు. ఖుష్భూకు పోటీగా డిఎంకే నుంచి డాక్టర్ ఎజల ఉన్నారు. 
 
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్భూ ఆ పార్టీని వీడి బిజెపిలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సోనియాగాంధీకి ఒక లేఖ కూడా రాశారు. మీ పార్టీలో అణచివేతకు గురవుతున్నానంటూ లేఖ రాయడం.. అది కాస్త పెద్ద చర్చకే దారితీసింది. 
 
కానీ బిజెపితో అలియన్స్ అన్నాడిఎంకే. పొత్తులో భాగంగానే బిజెపికి 20 సీట్లిచ్చారు. ప్రస్తుతం అన్నాడిఎంకే పార్టీ తమిళనాడులో పటిష్టంగా ఉండడంతో గెలుపు తనదేనన్న ధీమాతో మొదట్లో ఉన్నారు ఖుష్భూ. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు థౌజండ్స్ పిల్లర్స్ లైట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది.
 
గతంలో ఆ పార్టీలోనే ఉండి వచ్చి చివరకు అదే పార్టీని తిట్టడంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల నుంచి తనకు తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీతో పొత్తు ఉన్న పరిస్థితుల్లో తన గెలుపు సాధ్యమా అన్న అనుమానంలో ఉన్నారట. ధైర్యంగా ముందుకు వెళదాం.. ఓటమే గెలుపో తేల్చుకుందామంటూ డిసైడ్ అయ్యారట ఖష్భూ. మరి చూడాలి ఖుష్బూకి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వుందో లేదో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత రైల్వేలు దేశానికి ‘వృద్ధికి ఇంజిన్’ .. ప్రైవేటీకరించం : పియూష్ గోయల్