Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు.. ఎందుకంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (15:29 IST)
Dead Body
పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో  పోస్టుమార్టం వద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు. పోలీసులు అతడిని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంగళ్లపల్లి మండలం, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన జడల మల్లయ్య గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెందాడని తెలుసుకుని బోరుమంది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. 
 
అందుకు మల్లయ్య కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహన్ని భుజంపై వేసుకుని మలయ్య గుండెపోటుతో చనిపోయాడని.. ఆయన మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదంటూ పరుగులు తీశాడు. కానీ పోలీసులు అతడిని వెంబడించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments