Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి షెడ్యూల్ తో ఘోస్ట్ షూటింగ్ పూర్తి

Advertiesment
Dr Shivraj Kumar
Dr Shivraj Kumar
కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా టీం అద్భుతంగా డిజైన్ చేసిన రెట్రో మోషన్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వింటెజ్ శివ రాజ్ కుమార్ స్టిల్ తో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానుంది. 
 
యాక్షన్ థ్రిల్లర్ గా తెరెక్కుతున్న ఘోస్ట్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్ లో పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరు లో వేసిన మరో భారీ సెట్ లో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యుల్ లో ఇంట్రడక్షన్, క్లైమాక్స్ సన్నివేశాలతో పాటూ నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారు. దీంతో ఫిబ్రవరి లోనే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో ఘోస్ట్ మ్యూజిక్ రైట్స్ ను రికార్డ్ ప్రైస్ కి కైవసం చేసుకుంది. అన్నీ భాషల ఆడియో హక్కులను ఆనంద్ ఆడియో సొంతం చేసుకోవడం విశేషం.
 
ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
 
క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ :  సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
ఆడియో: ఆనంద్ ఆడియో, 
పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజు’స్ టీం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో ఏటీఎం : హరీష్‌ శంకర్