Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు కావాలంటూ పోస్టర్లు .. ఎక్కడ?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (13:49 IST)
తమిళనాడుకు చెందిన యువకుడు వధువు కావాలంటూ ఊరంతా పోస్టర్లు అంటించారు. విల్లుపురానికి చెందిన 27 యేళ్ళ జగన్ తనకు వధువు కావాలని ఊరిలో పోస్టుర్లు అంటించారు. మంచి భాగస్వామి కోసం తాను వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. 
 
పైగా, ఈ పోస్టర్లలో తాను ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్​గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో భాగస్వామిని వెతికేందుకు ప్రయత్నించాడు. కానీ అది ఫలితం ఇవ్వకపోవడంతో ఈ కొత్త పద్ధతిని ఎంచుకున్నాడు. 
 
ఈ పోస్టర్లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు. చిన్న స్థలం కూడా తన పేరు మీద ఉందని అందులో చెప్పుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ వేసుకున్న ఫొటోను సైతం పోస్టర్​పై ముద్రించాడు.
 
తాను ఓ మేనేజరుగానే కాకుండా డిజైనర్​నని చెప్పాడు. డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడే ఇలాంటి వినూత్న ఆలోచన తనకు తట్టిందని తెలిపాడు. 'గత ఐదేళ్లుగా నేను భాగస్వామి కోసం వెతుకుతున్నాను. కానీ, నా ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. 
 
ఇప్పటివరకు వివిధ అడ్వర్టైజ్​మెంట్​ల కోసం చాలా పోస్టర్లు డిజైన్ చేశాను. ఈ క్రమంలోనే 'నాకు నేను ఎందుకు ఓ పోస్టర్ డిజైన్ చేసుకోకూడదు?' అన్న ఆలోచన వచ్చింది. ఏదేమైనా.. 90లలో పుట్టినవారికి ఇప్పుడు చాలా కష్టమైన కాలం నడుస్తోంది' అంటూ తన గోడు చెప్పుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments