వీధి శునకం కోసం కుటుంబాన్ని దూరం పెట్టిన వ్యక్తి

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (09:08 IST)
చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరునిండ్రయూరులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వీధి శునకం కోసం ఏకంగా తన కుటుంబాన్నే దూరం పెట్టేశాడు. ఈ వీధి కుక్కను ప్రాణపదంగా పెంచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని.. వీధి కుక్కను వదిలిపెట్టాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆయన నిరాకరించి, ఏకంగా కుటుంబ సభ్యులనే దూరం పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తిరునిండ్రయూర్ సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సుందర్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆ కాలేజీకి సమీపంలోనే ఓ అద్దె ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి వుంటున్నారు. ఆయన ఓ వీధి కుక్కను చేరదీసి.. దానికి బ్లాకీ అనే పేరు పెట్టాడు. ఆ వీధి కుక్కకు కూడా యజమాని అంటే మాటల్లో చెప్పలేనంత విశ్వాసం. సుందర్ చేతిలో పెడితేనే అది ఆహారం తినేది. పక్కనే మాంసం ఉన్నా ఆయన అనుమతి లేనిదే ముట్టుకునేది కాదు. 
 
అలాంటి వీధి కుక్కను వదిలిపెట్టాలను కుటుంబ సభ్యులు సుందర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆయన అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆయనపై మరింత ఒత్తిడి పెరగడంతో ఆయన ఏకంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అలా గత తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments