Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్సర్ వ్యాధి నిర్ధారణ : కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య

Advertiesment
lovers suicide
, శుక్రవారం, 23 జూన్ 2023 (13:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో దంపతులు తమ కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని అనారోగ్య సమస్యలు వెంటాడటంతో వాటి నుంచి విముక్తి పొందేందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొత్తకారాయిగూడెంకు చెందిన పోట్రు కృష్ణయ్య (40), సుహాసిని (35) అనే దంపతులు ఉన్నారు. వీరికి అమృత (19) అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి ఆపరేషన్ జరిగింది. దీనికి సంబంధించిన శాంపిల్స్‌లో ఆమెకు కేన్సర్ సోకినట్టు తేలింది. దీంతో తిరువూరు వైద్యులు హైదరాబాద్ నగరంలో కీమోథెరఫీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆ ముగ్గురు... తిరువూరు నుంచి గ్రామానికి వెళ్లే సమయంలో ముగ్గురూ మూడు స్టూళ్లతో పాటు తాడును కొనుగోలు చేశారు. 
 
ఆ తర్వాత కొత్తరాయిగూడెంలో ఉన్న మామిడి తోటలోకి వెళ్లి ముగ్గురూ గురువారం రాత్రి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు వీరిని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్న భార్య 
 
తెలంగాణ రాష్ట్రంలో ఒక విషాదకర ఘటన జరిగింది. భర్త వేధింపులు తాళలేని ఓ భార్య... ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుంది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని నాచారంలో ఇది జరిగింది. 
 
ఈ హేమంత్, సన అనే భార్యాభర్తల మధ్య గత ఐదు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తీవ్ర మనస్తాపానికి గురైన సన... ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. ఈ ఘటనపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
పట్టపగలు వైకాపా కార్యకర్త దారుణ హత్య 
 
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆయన పార్టీకే చెందిన కార్యకర్తను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపేశారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. భూతగాదాల కారణంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మరికొందరికి మధ్య కొన్ని రోజులుగా భూతగాదాలు ఉన్నాయి. కాలక్రమంలో ఇవి మరింతగా పెరిగిపోయాయి. దీంతో ప్రత్యర్థులు శ్రీనివాసులు రెడ్డిపై కక్ష పెంచుకుని ఆయన హత్యకు కుట్ర పన్నారు. 
 
తమ పథకంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీనివాసులు రెడ్డి జిమ్ నుంచి ఇంటికి వెళుతుండగా, బురాఖా ధరించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి మారణాయుధాలతో దాడి చేశారు. విచక్షణా రహితంగా కత్తులతో పొడవడంతో శ్రీనివాసులు రెడ్డి అక్కడే కుప్పకూలి రక్తపుమడుగులో ప్రాణాలు విడిచాడు. కొందరు స్థానికులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 
 
వాగులో పడి బీటెక్ విద్యార్థి మృతి 
 
సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణం తీసింది. బీటెక్ కుర్రోడు వాగులో పడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) అనే యువకుడు స్థానికంగా ఉండే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్‍తో కలిసి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై కంఠాత్మాకూర్ వాగు వద్దకు చేరుకుని, సెల్ఫీలు తీసుకుంటున్నారు. 
 
వాగులోని నీటిని నిల్వచేసేందుకు నిర్మించిన చిన్నపాటి కరకట్ట (చెక్ డ్యామ్) వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ఇతర స్నేహితులు బిగ్గరగా అరిచారు. సయ్యద్ జాహెద్ షా, అబ్దుల్ షాదాద్‌లు బిగ్గరగా కేకలు వేశాడు. 
 
దీంతో అక్కడ ఉన్న ఇతరులు నీటిలో మునిగిపోతున్న ఇస్మాయిల్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న దామెర ఎస్ఐ రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకున్న భార్య