Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి పట్ల వైద్యుడి నిర్లక్ష్యం.. సూది మొన అక్కడ ఇరుక్కుపోయింది..

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (10:40 IST)
వైద్యులు ఏకాగ్రతతో చేయాల్సిన పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు నడుము తొంటి భాగంలో సూది ఇరుక్కుపోయింది. నొప్పితో చిన్నారి అల్లాడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని శిశువు తల్లి ఆరోపించారు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. 
 
తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడులో ఈ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. ఎట్టిమదైపూర్‌కి చెందిన రమీలా(26) ఇటీవల భర్త కార్తీకేయన్‌తో గొడవ కారణంగా కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లాక కొడుకు అనారోగ్యం బారిన పడటంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు చేసి సూది మందు ఇచ్చారు. అయితే సూది మందు ఇస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. సూది మొన కాస్త తొంటిలో ఇరుక్కుపోయింది.
 
దీంతో చిన్నారికి అక్కడ వాపు వచ్చింది. మరుసటి రోజు ఈ విషయాన్ని గమనించారు. కానీ చిన్నారికి వాపు ఎక్కువ కావడంతో రమీలా దానిపై గట్టిగా నొక్కడంతో.. సూది మొన బయటపడింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సదరు వైద్యులపై ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments