పూరి ఫైట‌ర్ గురించి ఎక్స్‌క్లూజివ్ డీటైల్స్, విజయ్ దేవరకొండ సరసన జాన్వీ

సోమవారం, 23 డిశెంబరు 2019 (20:59 IST)
డేరింగ్ & డాషింగ్ డెరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తోన్న తాజా చిత్రం ఫైట‌ర్. సెన్సేష‌నల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ చాలా స్పీడుగా జ‌రుగుతోంది. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చిన పూరి ఈ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎలా చూపించ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది.
 
ఇదిలా ఉంటే... పూరి త‌న సినిమాల ద్వారా హీరోయిన్స్‌ని తెలుగుతెర‌కు ప‌రిచ‌యం చేస్తుంటారు. రేణు దేశాయ్, ర‌క్షిత‌, అసిన్, హ‌న్సిక‌.. ఇలా చాలామంది హీరోయిన్స్‌ని ప‌రిచ‌యం చేసారు. దీంతో ఫైట‌ర్ సినిమాతో ఏ హీరోయిన్‌ని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారో..? కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తారా..? బాలీవుడ్ భామ‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేస్తారా..? అని ఆరా తీస్తే... ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ తెలిసింది. 
 
అది ఏంటంటే... విజ‌య్ స‌ర‌స‌న అతిలోక సుంద‌రి ముద్దుల కూతురు జాన్వీని క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేసార‌ట‌. పూరి, ఛార్మి క‌లిసి నిర్మిస్తున్న ఈ మూవీ నిర్మాణంలో బాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహ‌క‌ర్ కూడా పార్ట‌న‌ర్‌గా చేరారు. మ‌రో విష‌యం ఏంటంటే... ఇందులో విజ‌య్ మ‌ద‌ర్‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌నుంది. 
 
పూరి త‌న‌యుడు ఆకాష్ పూరి రొమాంటిక్‌లో కీల‌క పాత్ర పోషించిన ర‌మ్య‌కృష్ణ ఫైట‌ర్‌లో మ‌ద‌ర్ రోల్‌లో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ట‌. ప్ర‌స్తుతం పూరి టీమ్ ముంబాయిలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఫైన‌ల్ చేయ‌డం, మంబాయిలో షూటింగ్ చేసేందుకు లోకేష‌న్స్ సెర్చ్ చేయ‌డం వ‌ర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్లాప్ డైరెక్ట‌ర్‌తో మెగా హీరో సినిమా చేస్తున్నాడా..?