Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ప్రారంభమైన వలసలు

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరియు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆత్మకూరు నియోజకవర్గంలో టిడిపి నుంచి భారీ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు ప్రారంభమయ్యాయి.
 
చేజర్ల మండల పరిషత్ మాజీ అధ్యక్షులు తూర్పు కభంపాడు గ్రామానికి చెందిన శ్రీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు చేజర్ల మండల కన్వీనర్ శ్రీ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి మరియు ఆత్మకూరు నియోజకవర్గ బి.సి. కన్వీనర్ శ్రీ గోతం వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నేడు మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 
 
వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, కుల, మత, ప్రాంత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న  స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments